schedule Tuesday, July 07, 2026

ఆఫర్లకు అత్యాస పోవద్దు..!

calendar_today May 19, 2024
person dharshininews
ఆఫర్లకు అత్యాస పోవద్దు..!
ఆఫర్లకు అత్యాస పోవద్దు..! - సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి - తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి - పోలీసు, మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆన్‌లైన్‌లో వచ్చే ఆఫర్లకు ఎవ్వరు అత్యాస పడరాదని, దాని వెనుక సైబర్‌ నేరాలు దాగి ఉంటాయని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని బాలాజీ మందిర్‌లో మార్వాడి యువమంచ్, పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని చెడుగా వినియోగించే కేటుగాళ్లు ఈ సైబర్ నేరాలకు పాల్పడుతుంటారని తెలిపారు. అవగాహన లేని వాళ్లను, అత్యాస కలిగిన వాళ్లను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతుంటారని అన్నారు. ఎవరైనా ఆన్‌లైన్‌ లింకులను ఓపెన్ చేయరాదని, అధిక డబ్బులు ఇస్తాం ఆశ చూసే రుణాల యాప్‌లను అత్యాస పడరాదన్నారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే 1930 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అంతేకాకుండా మోబైల్‌ ఫోన్లలో హ్యాక్‌ ఐ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని మోసపోకుండా ఉండాలన్నారు. అనంతరం మంచ్ సభ్యులు డీఎస్పీ బాలకృష్ణారెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్వాడి యువమంచ్ అధ్యక్షులు అనిల్ సార్డా, కార్యదర్శి సచిన్ రాఠీ, కోశాధికారి అరుణ్ సార్డా, మాజీ అధ్యక్షులు బ్రిజ్ మోహన్ బూబ్, జాతీయ సభ్యులు మన్మోహన్ సార్డా, కుంజ్ బిహారి సోని, సన్ని అగ్రవాల్, దినేష్‌ పర్తాని, సమాజం పెద్దలు, మహిళలు, మంచ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26600/