schedule Sunday, September 13, 2026

రోడ్లపైకి రాకండి..!

calendar_today May 20, 2024
person dharshininews
రోడ్లపైకి రాకండి..!
రోడ్లపైకి రాకండి..! - కూరగాయ వ్యాపారులకు సూచన - పోలీసు, మున్సిపల్ అధికారుల అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్లపైకి వచ్చి వ్యాపారాలు చేయవద్దని తాండూరు పోలీసులు, మున్సిపల్ అధికారులు సూచించారు. సోమవారం తాండూరు పట్టణంలోని ఇందిరా చౌరస్తా నుంచి శాంత్ మహాల్ చౌరస్తా మార్గంలో వ్యాపారులకు అవగాహన కల్పించారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చి వ్యాపారాలు చేయరాదని సూచించారు. రోడ్డుపైకి వచ్చి విక్రయాలు చేయడం వల్ల ట్రాఫిక్ అంతరాయంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. రోడ్లపైకి వచ్చి వ్యాపారాలు చేస్తే చర్యలు తప్పవని అన్నారు. లేదంటే రైతు బజార్ కు వెళ్లి వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26633/