schedule Tuesday, July 07, 2026

101 ట్రాక్టర్ల ఇసుక వేలానికి సిద్దం

calendar_today May 22, 2024
person dharshininews
101 ట్రాక్టర్ల ఇసుక వేలానికి సిద్దం
101 ట్రాక్టర్ల ఇసుక వేలానికి సిద్దం - ఉత్తర్వులు జారీ చేసిన తహసీల్దార్ - తేది, స్థలం ఖరారు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలో సీజ్ చేసిన 101 ట్రాక్టర్ల ఇసుకకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు తాండూరు తహసీల్దార్ తారాసింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరు మండలం చెన్ గెష్ పూర్ గ్రామ పరిధిలో ఉన్న సర్వేనెంబర్ 83లో తవ్వకాలు జరిపిన 101 ట్రాక్టర్ల ఇసుకను ఆస్ఐ సమక్షంలో సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సీజ్ చేసిన ఇసుకను వాల్టా చట్టం మేరకు బహిరంగ వేలం వేయడం జరుగుతుందని వెల్లడించారు. ఎల్లుండి శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇసుకను సీజ్ చేసిన సర్వేనెంబర్ లోనే బహిరంగ వేలం వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇసుకను దక్కించుకునేందుకు ఆసక్తిగల వారు వేలంలో పాల్గొనవచ్చని సూచించారు. నిర్ణయించిన ధర ప్రకారం బిడ్ మొత్తం వసూలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26660/