schedule Tuesday, July 07, 2026

తాండూరులో మళ్లీ పవర్ కట్

calendar_today May 22, 2024
person dharshininews
తాండూరులో మళ్లీ పవర్ కట్
తాండూరులో మళ్లీ పవర్ కట్ - ప్రకటించిన విద్యుత్ శాఖ అధికారులు - ఏయే ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో మళ్లీ పవర్‌ కట్ విధిస్తున్నట్లు విద్యుత్ శాఖ డీఈ బాను ప్రసాద్ ప్రకటించారు. రేపు గురువారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని వెల్లడించారు. తాండూరు మున్సిపల్ పరిధి ఎన్టీఆర్ కాలనీ, రాజీవ్ గృహ కల్ప, హైదరాబాద్‌ రోడ్డు మార్గంతో పాటు తాండూరు మండలం అంతారం, తదితర గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. దీంతో పాటు పెద్దేముల్ మండలం గాజీపూర్, మంబాపూర్, ఇందూరు, తట్టెపల్లి సబ్ స్టేషన్ పరిధిలో కూడా విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. విద్యుత్ సరఫరా మరమ్మత్తులను దృష్టిలో ఉంచుకుని విధిస్తున్న అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26570/