schedule Saturday, September 12, 2026

హస్తం నుంచి ఇద్దరు ఔట్...!

calendar_today May 24, 2024
person dharshininews
హస్తం నుంచి ఇద్దరు ఔట్...!
హస్తం నుంచి ఇద్దరు ఔట్...! - టౌన్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై వేటు - యూత్ ప్రభంజనం నాయకుడి సస్పెండ్‌ - జిల్లా అధ్యక్షుల ప్రకటన జారీ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్‌ పార్టీలో ఇద్దరు నేతలపై వేటు పడింది. పార్టీ జిల్లా కమిటి తీసుకున్న నిర్ణయం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇందుకు గల కారణాలతో పార్టీ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ వడ్డె శ్రీనివాస్‌తో పాటు బషీరాబాద్‌ మండలం కొర్విచేడ్‌ గ్రామానికి చెందిన యూత్ ప్రభంజనం అధ్యక్షులు శ్రీనివాస్‌లపై సస్పెండ్ వేటు వేయడం జరిగిందని ప్రకటనలో వెల్లడించారు. గడిచిన ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం నుంచి వారు పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతూ పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించారని తెలిపారు. దీంతో వడ్డే శ్రీనివాస్, యూత్ ప్రభంజనం నాయకులు శ్రీనివాస్‌లపై సస్పెండ్‌ వేటు వేసినట్లు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తాండూరు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ వడ్డె శ్రీనివాస్‌పై గతంలో కూడా పార్టీ నుంచి వేటు వేసినట్లు పలువురు గుర్తుచేస్తున్నారు. ఆయనపై వేటు పడడం ఇది రెండోసారి అని గుసగులాడుకుంటున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26705/