schedule Saturday, September 05, 2026

ట్రేడ్ వడ్డన..!

calendar_today May 27, 2024
person dharshininews
ట్రేడ్ వడ్డన..!
ట్రేడ్ వడ్డన..!  - లైసెన్సులు రెన్యూవల్‌ లేకుంటే ఫెనాల్టీ - జూన్‌ 1 నుంచి అపరాధ రుసుం రెట్టింపు దర్శిని డెస్క్ : వ్యాపారాలు చేసుకుంటున్న దుకాణదారులకు, వ్యాపారులకు ఇదో చిన్న హెచ్చరిక. వ్యాపారాల కోసం పొందిన లైసెన్సులు రెన్యువల్‌ చేసుకోకపోతే ఫెనాల్టీ వడ్డన తప్పదు. మున్సిపాల్టీల్లో పలువురు వ్యాపారాలు చేసుకునేందుకు ఆ శాఖ ట్రేడ్ లైసెన్సులను జారీ చేసింది. గతంలో మాన్యువల్‌లో ఉన్న పద్దతి ఆన్‌లైన్ ద్వారా కొత్త విధానంలోకి తీసుకవచ్చారు. ప్రస్తుతం ట్రేడ్‌లైసెన్స్‌ల జారీ, అపరాధ రుసుముల నిర్ణయ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఈ అంశమై దుకాణదారులు, వ్యాపారులకు సరైన అవగాహన లేక ఎవరూ ముందుకు రావడం లేదు. అధికారులు ఆ దిశగా శ్రద్ధ చూపించడం లేదు. ట్రేడ్‌లైసెన్స్‌ ఉంటేనే వ్యాపారులకు బ్యాంకు రుణాలు మంజూరు చేస్తారు. ఆ సమయంలో లైసెన్స్‌ల కోసం వెళ్తే అధిక మొత్తంలో అపరాధ రుసుము చెల్లించాలి. అయితే కొత్త లైసెన్స్‌ విధానంలో లైసెన్సు ఫీజు భారీగా పెరిగింది. దీంతో చాలా మంది పునరుద్ధరించుకోవడానికి ముందుకురావడం లేదు. లైసెన్స్‌ పునరుద్ధరణ గడువు మార్చి 31తో ముగిసింది. ఏప్రిల్, మే నెలల్లో 25 శాతం అపరాధ రుసుముతో పునరుద్ధరించడానికి అవకాశముంది. కొత్త వ్యాపార లైసెన్స్‌ విధానంలో భాగంగా ఇప్పటికే వ్యాపార అనుమతి విలువలో 25 శాతం అపరాధ రుసుము కట్టాలి.లేకపోతే జూన్‌ 1 నుంచి అపరాధ రుసుము 50 శాతం పెరగనుంది. మరింత ఆలస్యం చేస్తే అపరాధ రుసుము ఇంకా భారం కానుంది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26787/