schedule Tuesday, July 07, 2026

దత్తాత్రేయ స్వామి సేవలో బీఎస్ఆర్..!

calendar_today May 27, 2024
person dharshininews
దత్తాత్రేయ స్వామి సేవలో బీఎస్ఆర్..!
దత్తాత్రేయ స్వామి సేవలో బీఎస్ఆర్..! - ప్రత్యేక పూజలు చేసిన శ్రీనివాస్ రెడ్డి దంపతులు తాండూరు, దర్శిని ప్రతినిధి : కర్ణాటకలోని గాన్గాపూర్ లో వెలసిన శ్రీ దత్తాత్రేయ స్వామి సేవలో తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి దంపతులు తరించారు. సోమవారం శ్రీనివాస్ రెడ్డి, సరళారెడ్డి దంపతులు దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వేదమంత్రోచ్చరణల మద్య శ్రీనివాస్ రెడ్డి దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి అని అన్నారు వారి వెంట యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, నాయకులు వికాష్ జోషి, బాతుల నగేష్, విష్ణు తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26810/