schedule Sunday, July 05, 2026

అనుకోని అగ్ని ప్రమాదం..!

calendar_today June 1, 2024
person dharshininews
అనుకోని అగ్ని ప్రమాదం..!
chai jr అనుకోని అగ్ని ప్రమాదం..! - రూ. 45 వేల విలువైన ఆస్తి నష్టం - తాండూరు గగ్రాణి ఫంక్షన్‌ వద్ద ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : అనుకోకుండా ప్రమాద వశాత్తు జరిగిన అగ్ని ప్రమాదం ఆస్తినష్టాన్ని మిగిల్చింది. ఈ సంఘటన శనివారం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. ఫైర్‌ ఆఫీసర్లు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని సీతారాంపేట్‌లో గగ్రాణీ ఫంక్షన్‌ హాల్ కొనసాగుతోంది. ఈ ఫంక్షన్‌ హాల్‌ వెనుకాల ఖాళీ ప్రదేశంలో పశువుల పాకను ఏర్పాటు చేశారు. ఇందులో గడ్డివామును ఉంచారు. అయితే శనివారం మధ్యాహ్నం అనుకోకుండా అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద వశాత్తు మంటలు పశువుల పాకకు వ్యాపించాయి. దీంతో గడ్డివాము పూర్తిగా దగ్దమయ్యింది. స్థానికులు తాండూరు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. అప్పటికే యజమానులు, స్థానికులు నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు రూ. 45 వేల ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేయడం జరిగిందని ఫైర్ హెడ్ కానిస్టేబుల్ గోపాల్ తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26891/