schedule Tuesday, July 07, 2026

జై తెలంగాణ..!

calendar_today June 2, 2024
person dharshininews
జై తెలంగాణ..!
chai jrజై తెలంగాణ..! - హోరెత్తించిన ఉద్యమకారులు - జయశంకర్‌ సారుకు నివాళులు తాండూరు, దర్శిని ప్రతినిధి : జై..తెలంగాణ, జయహో జయశంకర్‌ సార్ అనే నినాదాలతో తాండూరు పట్టణంలోని ఇందిరా చౌరస్తా దద్దరిల్లింది. ఆదివారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల పండగను ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో ఉన్న తెలంగాణ జాతిపిత ఫ్రోఫెసర్ జయశంకర్‌ సార్ విగ్రహానికి ఉద్యమకారులు నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాన్ని గుర్తుచేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణతో పాటు జయహో జయశంకర్ సార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరులను గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకునేందుకు అందరు కృషి చేయాలన్నారు. జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి హన్మంతరావు, మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, టీజేఎస్ ఇంచార్జ్ సోమశేఖర్, విజయ్ కుమార్, కమల్ అతహర్, ముజీబ్, జిలానీ, నందకుమార్, భాను, కేశవులు, ప్రకాష్‌ గౌడ్, దత్తు, శరణు, గౌరీ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26898/