schedule Tuesday, July 07, 2026

పడిపోయిన బీఆర్ఎస్ గ్రాఫ్‌..!

calendar_today June 4, 2024
person dharshininews
పడిపోయిన బీఆర్ఎస్ గ్రాఫ్‌..!
chai jr పడిపోయిన బీఆర్ఎస్ గ్రాఫ్‌..! - పార్లమెంట్‌లో పోలైన ఓట్లు తక్కువే - తాండూరు పట్టణంలో డబుల్‌ డిజిట్‌ ఓట్లు - పర్వాలేదని అనిపించుకున్న మండలం తాండూరు, దర్శిని ప్రతినిధి: పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. తాండూరు పట్టణం, మండలంలో బీఆర్ఎస్ పార్టీకి ఓటర్లు గట్టి షాక్‌ ఇచ్చారు. దీంతో తాండూరులో బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి పరిమితం అయ్యింది. చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికల బరిలో కాంగ్రెస్, బీజేపీలతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఫెవరెట్‌గా నిలించింది. రెండు జాతీయ పార్టీలకు ఎన్నికల పోటీలో ధీటుగా నిలిచింది. తాండూరులో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పార్టీని గెలిపించేందుకు విస్తృతంగా కృషి చేశారు. పార్టీ నేతలు కూడా గట్టిగా పనిచేశారు. అయితే ప్రచారం ముగింపుకు ముందు పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. పోలింగ్ రోజు వరకు పార్టీ నేతలు ఓటర్లను ఆకర్షించలేకపోయారు. పోలింగ్ రోజు కేంద్రాలలో ఏజెంట్లను కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ గ్రాఫ్‌ డౌన్ ఫౌల్ అయ్యిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మంగళవారం వెలువడిన కౌంటింగ్ ఫలితాల్లో తాండూరు మున్సిపల్‌ నుంచి పోలైన ఓట్లు డబుల్‌ డిజిట్‌లకే పరిమితం కావడం గమనార్హం. తాండూరు పట్టణంలో ఏ పోలింగ్ కేంద్రంలో కూడా ఆదిక్యతను ప్రదర్శించపోయింది. కేవలం 1289 ఓట్లను మాత్రమే రాబట్టింది. తాండూరు మండలంలో మాత్రం కాస్త పర్వాలేదనిపించింది. మండలంలోని కోటబాస్పల్లి గ్రామంలో కాంగ్రెస్, బీజేపీల కంటే 67 ఓట్ల ఆధిక్యతను సాధించింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/26989/