schedule Tuesday, September 15, 2026

గౌరీ హనుమంతు కుటుంబాన్ని పరామర్శించిన కేపీఆర్

calendar_today June 5, 2024
person dharshininews
గౌరీ హనుమంతు కుటుంబాన్ని పరామర్శించిన కేపీఆర్
chai jrగౌరీ హనుమంతు కుటుంబాన్ని పరామర్శించిన కేపీఆర్ - కుటుంబాన్ని ఓదార్చిన కరణం పురుషోత్తంరావు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని సాయిపూర్‌కు చెందిన గౌరీ హనుమంతు కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు, యాలాల మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తంరావు పరామర్శించారు. గౌరీ హన్మంతు కన్నుమూసిన విషయం తెలుసుకుని బుధవారం కరణం పురుషోత్తంరావు వారి నివాసానికి చేరుకున్నారు. కరణం పురుషోత్తంరావుతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రామచందర్ తదితరులు గౌరీ హన్మంతు భౌతిక ఖాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం హనుమంతు సోదరుడు, రియల్ ఏస్టేట్ వ్యాపారి గౌరీ రాములు, రిటైర్డ్ టీచర్ ఎల్లప్పలతో మాట్లాడి ఓదాచ్చారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి, అవరసరమైతే కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ డైరెక్టర్ కె. కృష్ణకుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27038/