schedule Tuesday, July 07, 2026

పేదల ఆకలి తీర్చడంలో సంతృప్తి

calendar_today June 7, 2024
person dharshininews
పేదల ఆకలి తీర్చడంలో సంతృప్తి
chai jrపేదల ఆకలి తీర్చడంలో సంతృప్తి - తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ - వైశ్య ఫెడరేషన్ శిబిరంలో అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల ఆకలి తీర్చడంలో సంతృప్తి లభిస్తుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. తాండూరు పట్టణం డీసీఎంఎస్ ఎదురుగా వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరం 19వ రోజు కొనసాగింది. శుక్రవారం నిర్వహించిన అన్నదానానికి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ దాతగా నిలిచారు. ఈ సందర్భంగా శిబిరం వద్దకు వచ్చి చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర యూత్ కార్యదర్శి రొంపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి పేదలకు అన్నదానం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. అన్నదానం మహాదానమని, వైశ్య ఫెడరేషన్ పేదల ఆకలి తీర్చేందుకు చేస్తున్న కార్యక్రమం అభినందనీయమన్నారు. పేదల కోసం చేస్తున్న అన్నదాన సేవకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అలంపల్లి శ్రీనివాస్, కార్యదర్శి కోడూరు వినోద్, సహా కార్యదర్శి సంపత్, వైశ్య ఫెడరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27067/