schedule Sunday, July 05, 2026

నీ జాడేది.. బిడ్డా..!

calendar_today June 8, 2024
person dharshininews
నీ జాడేది.. బిడ్డా..!
chai jr నీ జాడేది.. బిడ్డా..! - మతిస్థిమితం లేని యువకుడి అదృశ్యం - పది రోజులుగా లభించని ఆచూకీ - ఆందోళన చెందుతున్న కుటుంభీకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఏడ ఉన్నావూ.. ఏం.. తిన్నావో.. నీ జాడేది బిడ్డ అంటూ తల్లిదండ్రులు ఓ యువకుడి కోసం ఆందోళన చెందుతున్నారు. మతి స్థిమితం సరిగ్గాలేని యువకుడు పది రోజుల క్రితం అదృశ్యం కావడమే ఆందోళనకు కారణం. తాండూరు పట్టణం గాంధీనగర్‌కు చెందిన బిర్కడ్‌ అంబదాస్‌ కుమారుడు రాకేష్‌(29)కు మతిస్థిమితం సరిగ్గాలేదు. పట్టణంలోని శాంత్ మహల్ చౌరస్తాలో చిన్న హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. రాకేష్‌ అప్పుడప్పుడు హోటల్‌ వద్దకు వచ్చి కూర్చుంటుండేవాడు. అయితే గత నెల మే 31న కూడా హోటల్‌కు వచ్చాడు. అదే రోజు మధ్యాహ్నం హోటల్‌ నుంచి రాకేష్‌ ఎటో వెళ్లిపోయాడు. రాత్రి వరకు, మరుసటి రోజు ఉదయం వరకు ఇంట్లో వాళ్లు రాకేష్‌ కోసం వెతికారు. ఈనెల 1న తాండూరు పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. రాకేష్‌ తప్పిపోయిన సమయంలో సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. అయినప్పటికి ఇంకా రాకేష్‌ ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు రాకేష్‌ ఏమయ్యాడో.. ఎలా ఉన్నాడో.. అని ఆందోళన చెందుతున్నారు. పోలీసులు తమ బిడ్డను త్వరగా వెతికి పెట్టాలని కోరుతున్నారు. అంతేకాకుండా ఫోటోలోని రాకేష్‌ ఆచూకీ తెలిస్తే సెల్‌: 9642989876, 8309105251లకు సంప్రదించాలని కోరుతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27076/