schedule Sunday, July 05, 2026

కూలిన ఇళ్లు..!

calendar_today June 9, 2024
person dharshininews
కూలిన ఇళ్లు..!
chai jr కూలిన ఇళ్లు..! - పైకప్పు కూలీ వృద్ధుడికి గాయాలు - ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటి పైకప్పు కూలి ఓ వృద్దుడు గాయాల పాలయ్యాడు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణంలోని పసారి వార్డులో బిచ్చాల మల్లేశం ఇంట్లో కోటబాస్పల్లి యాదగిరి (55) కుటుంబంతో కలసి ఉంటున్నారు. ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో  వర్షాకాలం ఉందని, ఇంటి పైకప్పును సరిచేసేందుకు పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలీ పడింది. ఈ ప్రమాదంలో యాదగిరి తలకు, కాళ్లకు గాయాలయ్యాయి.  పైకప్పు బండల కింద యాదగిరి ఉండిపోయారు.  శబ్దం విన్న కుటుంభీకులు, స్థానికులు వెంటనే బండల కింద ఉన్న యాదగిరిని బయటకు తీసి చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యాదగిరి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన యాదగిరికి ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/27084/