రేపు తాండూరులో పవర్ కట్..!
June 9, 2024
dharshininews
రేపు తాండూరులో పవర్ కట్..!
- ప్రకటించిన విద్యుత్ శాఖ అధికారులు
- విద్యుత్ ఉండని ప్రాంతాలు ఏవి అంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : వర్షాకాలంలో తలెత్తే విద్యుత్ సమస్యలపై ఆ శాఖ అధికారులు దృష్టిసారించారు. వర్షాకాలంలో విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా తీసుకునే జాగ్రత్తల పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. ఇందుకోసం విద్యుత్ అంతరాయం తప్పనిసరి పరిస్తితి.
ఇందులో భాగంగా రేపు సోమవారం తాండూరు పట్టణంలో పవర్ కట్ విధిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు ప్రకటించారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటలకు వరకు పవర్ కట్ ఉంటుందని ప్రకటనలో వెల్లడించారు.తాండూరు పట్టణం, పాత తాండూరు పరిధితో పాటు పెద్దేముల్ మండలంలోని మంబాపూర్, ఇందూరు, గాజీపూర్, తట్టెపల్లి, తోర్మామిడి, యాలాల మండలంలోని లక్ష్మీనారాయణపూర్, దౌలాపూర్ ఉప కేంద్రాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని డీఈ భాను ప్రసాద్ తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/27088/