schedule Tuesday, July 07, 2026

దేశ ప్రగతి మోడితోనే సాధ్యం

calendar_today June 9, 2024
person dharshininews
దేశ ప్రగతి మోడితోనే సాధ్యం
chai jr దేశ ప్రగతి మోడితోనే సాధ్యం - తాండూరు కౌన్సిలర్ సాహు శ్రీలత - డిల్లీలో ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక ఆహ్వానం తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ ప్రగతి నరేంద్రమోడీతోనే సాధ్యపడుతుందని తాండూరు మున్సిపల్ 24వ వార్డు కౌన్సిలర్, బీజేపీ మహిళ మోర్చ రాష్ట్ర కార్యదర్శురాలు సాహు శ్రీలత లక్ష్మీకాంత్ అన్నారు. ఆదివారం ఢిల్లీలో వరుసగా మూడోసారి దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం అందింది. దీంతో సాహు శ్రీలత ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం అందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ముచ్చటగా మూడో సారి నరేంద్ర మోడి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం హర్షణీయమన్నారు. భారత దేశ ప్రగతి మోడీతోనే సాధ్యపడుతుందని అన్నారు. బీజేపీతో సుస్థిర పాలన అందుతుందని, పేదలు అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27092/