schedule Sunday, September 13, 2026

శభాష్‌ పోలీస్..!

calendar_today June 13, 2024
person dharshininews
శభాష్‌ పోలీస్..!
chai jrశభాష్‌ పోలీస్..! - వ్యర్థాలతో రోడ్లపై గుంతల పూడిక - దగ్గరుండి మూయించిన కరణ్‌ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : శాంతి భద్రతలను కాపాడడంతో పాటు అప్పుడప్పుడు ప్రజలను ఇబ్బందులను తొలగించే సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తామని తాండూరు మండలం కరణ్‌ కోట్ పోలీసులు నిరూపించారు. రహదారిపై ఏర్పడిన భారీ గోతులను కరణ్‌ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి దగ్గరుండి పూడ్చి వేయించారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు - గౌతాపూర్‌ మార్గంలో రహదారిపై అడుగు అడుగుకు ఓ గుంత ఏర్పడింది. ఈ మార్గంలో వచ్చి పోయే వాహనాలతో పాటు వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గుంతల్లో పడి పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు. గోతులను పూడ్చేందుకు సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో గత కొన్ని రోజులుగా పరిస్థితి ఆందోళన కరంగా మారింది. ఈ విషయం గమనించిన కరణ్‌ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి గురువారం ప్రత్యేక జేసీబీ సహాయంతో నాపరాతి వ్యర్థాలతో గోతులను పూడ్చే వేసే పనులు చేయించారు. దగ్గరుండి ఒక్కో గుంతలో నాపరాతి వ్యర్థాలను వేయించడంతో పాటు చదును కూడా చేయించారు. దీంతో అటుగా వెళుతున్న వాహనదారులు శభాష్ పోలీసు అంటూ కితాబులిచ్చారు. ముఖ్యంగా ఎస్ఐ విఠల్ రెడ్డిని అభినందించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27118/