schedule Tuesday, July 07, 2026

రండి... ఆస్వాదించండి..!

calendar_today June 13, 2024
person dharshininews
రండి... ఆస్వాదించండి..!
chai jr రండి... ఆస్వాదించండి..! - రేపు తాండూరులో ఫుడ్ మేళా - వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాట్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : రండి.. వంటకాల రుచులను ఆస్వాదించండి అంటూ తాండూరు వాసవీ మహిళ సంఘం అందరిని ఆహ్వానిస్తోంది. తాండూరు ఆర్యవైశ్య సంఘం సౌజన్యంతో వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో రేపు ఫుడ్‌ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి పట్టణంలోని ఆర్యవైశ్య ఓపెన్ ఆడీటోరియంలో ఫుడ్‌ మేళా ప్రారంభమవుతుందని తెలిపారు. ఫుడ్‌ మేళాలో వేడి వేడీగా, చల్ల చల్లగా, తీయ తీయగా, పుల్ల పుల్లని వంటకాలను ప్రదర్శించడం జరుగుతుందని చెప్పారు. మహిళలు ఈ ఫుడ్‌ మేళాలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫుడ్‌ మేళాతో పాటు వినోద కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఫుడ్‌ మేళా ఎంట్రీ ఫీజు రూ. పిల్లలకు రూ. 10లు, పెద్దలకు రూ. 20లు నిర్ణయించడం జరిగిందని, పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ హాజరై ఫుడ్ మేళాను సక్సెక్ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27057/