schedule Sunday, September 13, 2026

మాంసం వ్యర్థాల సేకరణకు ఏజెన్సీలు

calendar_today June 13, 2024
person dharshininews
మాంసం వ్యర్థాల సేకరణకు ఏజెన్సీలు
chai jrమాంసం వ్యర్థాల సేకరణకు ఏజెన్సీలు - దరఖాస్తుల ఆహ్వానం, ఆపై బహిరంగ వేలం - తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో మాంసం వ్యర్థాల సేకరణ, రవాణా, నిర్వీర్యం చేసే ఏజెన్సీల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ యాక్టు-2019 సెక్షన్ 52 కింద 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పట్టణ పరిధిలో చికెన్, మటన్, చేప మాంసాల వ్యర్థాలను సేకరణ, సైంటిఫిక్ డిస్పోజల్ చేసేందుకు అనుభవం ఉన్న కంపెనీల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు వెల్లడించారు. దరఖాస్తులు అందజేసే వారు 18వ తేదీ సాయంత్రం 4 గంటల్లోపు మున్సిపల్ కమీషనర్ కార్యాలయం పేరుపై రూ. 5వేల డీడీ చెల్లించి రెవెన్యూ విభాగంలో పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. వచ్చిన దరఖాస్తులలో 19వ తేది మున్సిపల్ కార్యాలయంలో బహిరంగ వేలం వేయడం జరుగుతుందని తెలిపారు. వేలంలో పాల్గొనే వారు సంబంధిత కంపెనీల నుంచి అనుమతి. సేఫ్ డిస్పోజల్ సర్టిఫికెట్ కలిగి ఉండాలన్నారు. వేలంలో పాల్గొనే వారిపై ఎలాంటి కేసులు నమోదు అయి ఉండరాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా బహిరంగ వేలంను ఎలాంటి పరిస్థితులలో అయినా రద్దు చేసే అధికారం మున్సిపల్ కు ఉంటుందని పేర్కొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27130/