schedule Tuesday, July 07, 2026

ఫుడ్‌ మేళా.. వేరే లేవల్..!

calendar_today June 14, 2024
person dharshininews
ఫుడ్‌ మేళా.. వేరే లేవల్..!
chai jrఫుడ్‌ మేళా.. వేరే లేవల్..! - మైమరిపించిన వంటకాలు - ప్రదర్శనలతో అదరగొట్టిన మహిళలు - వాసవీ మహిళ సంఘం ప్రోగ్రాం సక్సెస్ తాండూరు, దర్శిని ప్రతినిధి : చల్లని సాయంత్రం.. వేళ తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కణ్యాణ మండప ఆడిటోరియంలో నిర్వహించిన ఫుడ్‌ మేళా వేరే లేవల్‌ రేటింగ్ అందుకుంది. రకరకాల వంటకాలు, తినుబండరాలను రుచిచూస్తూ పలువురు మైమరిచిపోయారు. శుక్రవారం ఆర్యవైశ్య సంఘం సౌజన్యంతో వాసవి మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో ఫుడ్‌ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేళాలో ఆర్యవైశ్య సంఘం, వాసవి మహిళ సంఘం మహిళలు వివిధ వంటకాలను ప్రదర్శించారు. చల్లగా, పుల్లగా, తియ్యగా, స్పైసీగా పలు రకాల వంటకాలను ప్రదర్శించారు. ఫుడ్‌ మేళా ప్రదర్శనకు వచ్చిన చిన్నారులు, పెద్దలు, యువతీ, యువకులు వంటకాలను ఆస్వాదించి వేరే లేవల్ రేటింగ్‌లు ఇచ్చారు. అదుర్స్ అనే వంటకాలను రుచిచూస్తూ మైమరిచి పోయారు. అంతకుముందు ఫుడ్‌ మేళా కార్యక్రమానికి ఆర్యవైశ్య కార్పోరేషన్ స్టేట్ చైర్ పర్సన్ కల్వ సుజాత, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్యలు హాజరై ప్రదర్శనలను ప్రారంభించారు. అదేవిధంగా వంటకాల ప్రదర్శనలతో పాటు పలు వినోద కార్యక్రమాలు మరింత సందడిని పెంచాయి. ఆడుతూ, పాడుతూ.. ఫుడ్‌ మేళాను ఆస్వాదిస్తూ.. అదుర్స్ అనిపించారు. ఈ కార్యక్రమంలో వాసవి మహిళ సంఘం ఉపాధ్యక్షురాలు గుబ్బ ప్రగతి, ప్రధాన కార్యదర్శి మంకాల స్వప్న, ఉప కార్యదర్శి తాళ్లపల్లి కవిత, కోశాధికారి సింగంశెట్టి శోభ, కార్యవర్గ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవీ క్లబ్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ప్రతినిధులు, మహిళ నాయకులు, పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27152/