schedule Sunday, September 13, 2026

బక్రీద్‌కు భద్రత..!

calendar_today June 16, 2024
person dharshininews
బక్రీద్‌కు భద్రత..!
chai jr బక్రీద్‌కు భద్రత..! - తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి - ఈద్గా మైదానం పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ముస్లిం సోదరుల పవిత్ర పండగ బక్రీద్‌కు భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం తాండూరు పట్టణ శివారు చెన్‌గెష్‌పూర్ రోడ్డు మార్గంలో ఉన్న ఈద్గా మైదానాన్ని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి రూరల్ సీఐ అశోక్ కుమార్, కరణ్‌ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డిలతో కలిసి సందర్శించారు. ఈద్గా కమిటి చైర్మన్ యూసుఫ్‌ ఖాన్‌తో కలిసి బక్రీద్ పండగ ఏర్పాట్లను సమీక్షించారు. మైదానానికి ప్రార్థనల కోసం వచ్చే వారికి చేసిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ రంజాన్ పండగ తరహాలో బక్రీద్ పండగకు భద్రత ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. ఈద్గా, మసీదుల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పెద్ద సంఖ్యలో హాజరయ్యే ఈద్గా మైదానం వద్ద నిఘా, భద్రత చర్యలు చేపడుతున్నామన్నారు. పండగ ప్రశాంతంగా జరిగేలా దృష్టిసారిస్తున్నామన్నారు. పండగను అందరు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈద్గా కమిటి సభ్యులు, మైనార్టీ పెద్దలు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27219/