schedule Tuesday, July 07, 2026

ప్రయాణికుల సేవకు ఆర్టీసీ ప్రాధాన్యం

calendar_today June 17, 2024
person dharshininews
ప్రయాణికుల సేవకు ఆర్టీసీ ప్రాధాన్యం
chai jr ప్రయాణికుల సేవకు ఆర్టీసీ ప్రాధాన్యం - తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి - కొత్త సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రయాణికుల సేవకు ఆర్టీసీ సంస్థ ప్రాధాన్యం ఇస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు ఆర్టీసీ డీపో పరిధి నుంచి కొత్త బస్సు సర్వీసును ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. తాండూరు ఆర్టీసీ డీపో నుంచి తాండూరు - కొత్తూరు వయా యాలాల, దేవనూర్‌కు నడిపించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రయాణికుల సేవలకు అనుగుణంగా ఆర్టీసీ సంస్థ సేవలను అందిస్తుందని అన్నారు. తాండూరు ఆర్టీసీ డీపో నుంచి కొత్త సర్వీసు ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఈ సేవలను పరిసర ప్రాంతాల ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ రవీందర్ గౌడ్, డాక్టర్ సంపత్ కుమార్, కరణం పురుషోత్తంరావు, డీపో మేనేజర్ సమతారెడ్డి, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, సోమశేఖర్, రాము, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, సాయిపూర్ బాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్, డీపో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27232/