schedule Tuesday, July 07, 2026

ఏయిడెడ్‌ స్కూల్లో ప్రైవేటు బడులా..?

calendar_today June 20, 2024
person dharshininews
ఏయిడెడ్‌ స్కూల్లో ప్రైవేటు బడులా..?
chai jrఏయిడెడ్‌ స్కూల్లో ప్రైవేటు బడులా..? - అనుమతులు వెంటనే రద్దు చేయాలి - ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల డిమాండ్ - చర్చనీయాంశంగా విజయ విద్యాలయ తీరు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ ఏయిడెడ్ స్కూల్లో ప్రైవేటు బడులు ఎలా కొనసాగిస్తారని తాండూరు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. గురువారం తాండూరు మండల విద్యావనరుల కేంద్రంలో విద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణంలోని విజయ విద్యాలయ పాఠశాల ఏయిడెట్‌ పాఠశాలగా కొనసాగుతోంది. ఇదే పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో ప్రైవేటు పాఠశాల, ప్లే స్కూల్‌ కొనసాగుతున్నట్లు బయట పడింది. దీనిపై సీఐటీయూ, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మండల విద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. విజయ విద్యాలయ పాఠశాలలో నిబంధనలకు విరుద్దంగా కొనసాగుతున్న ప్రైవేటు, ప్లే స్కూళ్ల పర్మిషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఏయిడెడ్‌ స్కూల్లో ప్రైవేటు బడులు నిర్వహించడం పట్ల ప్రభుత్వ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. విద్యాధికారులు నిర్లక్ష్యాన్ని వీడి వెంటనే ప్రైవేటు, ప్లే స్కూల్‌ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే జిల్లా విద్యాధికారి, మండల విద్యాధికారి కార్యాలయాల వద్ద ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు అరుణ్ రాజ్, రాజు, దీపక్, రాజు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27299/