schedule Tuesday, July 07, 2026

నకిలీలపై ఉక్కుపాదం..!

calendar_today June 21, 2024
person dharshininews
నకిలీలపై ఉక్కుపాదం..!
chai jr నకిలీలపై ఉక్కుపాదం..! - రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి - వికారాబాద్‌ జిల్లా ఎస్పీ కె.నారాయణ - జిల్లా కొత్త ఎస్పీగా బాధ్యతల స్వీకరణ వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : నకిలీ విత్తనాలు, నకిలీ వ్యవహారాలపై ఉక్కుపాదం మోపుతామని వికారాబాద్‌ జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్‌ జిల్లా నూతన ఎస్పీగా ఎస్పీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలపై ఫోకస్ చేస్తామని, నకిలీ వ్యవహారాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. మీడియాతో వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి చెప్పారు. ఇక్కడ పనిచేసిన ఎస్పీ కోటిరెడ్డి మేడ్చల్ డిసిపి గా బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో నారాయణరెడ్డి వికారాబాద్ కు వచ్చారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/27316/