schedule Monday, September 14, 2026

దేవాలయాల్లో పాలకమండళ్లను పూర్తి చేయండి

calendar_today June 22, 2024
person dharshininews
దేవాలయాల్లో పాలకమండళ్లను పూర్తి చేయండి
chai jr దేవాలయాల్లో పాలకమండళ్లను పూర్తి చేయండి - మంత్రి కొండా సురేఖకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని దేవాలయాల్లో పాలక మండళ్లను పూర్తి చేసేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. శనివారం మంత్రి కొండా సురేఖను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తాండూరు నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో పాలక మండక మండళ్లు ఏర్పాటు కాలేదన్నారు. ఎన్నికల కోడ్ సందర్బంగా నియామకాలు ఆగిపోయాయని గుర్తుచేశారు. తాజాగా కోడ్ ముగిసిన సందర్భంగా నియోజకవర్గంలోని దేవాలయాల్లో పాలక మండళ్లను పూర్తి స్థాయిలో నియమించేలా దృష్టి సారించాలని కోరారు. దీంతో పాటు పలు దేవాలయాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఇందుకు మంత్రి కొండా సురేఖ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27348/