schedule Tuesday, July 07, 2026

తాండూరుకు సబ్ కలెక్టర్ హోదా హర్షణీయం

calendar_today June 22, 2024
person dharshininews
తాండూరుకు సబ్ కలెక్టర్ హోదా హర్షణీయం
chai jrతాండూరుకు సబ్ కలెక్టర్ హోదా హర్షణీయం - టీపీసీసీ రాష్ట్ర మైనారిటీ కన్వీనర్ ఎండీ రియాజ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఆర్డీఓ స్థాయిని సబ్ కలెక్టర్ హోదాకు పెంచడం హర్షణీయంమని టీపీసీసీ రాష్ట్ర మైనారిటీ కన్వీనర్ ఎండీ రీయాజ్ అన్నారు. తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యూని మనోహర్ రెడ్డిల కృషితో తాండూరులో రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ కార్యాలయంగా ఏర్పాటు చేస్తూ ఐఏఎస్ ఆఫీసర్‌ను నియమించేట్లు ఉత్తర్వులు రావడం గర్వకారణమన్నారు. సబ్‌ కలెక్టర్ స్థాయి హోదాతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకుండా ప్రజలకు మంచి పాలనను అందించే అవకాశం ఉంటుందన్నారు. ఇదే తరహాలో తాండూరు సబ్ డివిజన్ పరిధిలో పోలిస్ వ్యవస్థను మరింత మెరుగు పర్చాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మంత్రీగా ఉన్న సమయంలో తాండూరులో సబ్ కలెక్టర్ కార్యాలయం రావడం, ఐఏఎస్ అధికారి సందీప్‌ కుమార్ ఝా, పోలీసు శాఖలో ఐపీఎస్ అధికారి చందన దీప్తిను ప్రభుత్వం నియమించడం జరిగిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో జరిగిన లోటును కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేయడటం సంతోషకరమని అన్నారు, తాండూరులో సబ్ కలెక్టర్ హోదా కల్పించినట్లే పోలీసు శాఖలోని తాండూర్ డీఎస్పీ కార్యాలయంలో ఐపీఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27353/