schedule Tuesday, July 07, 2026

కాంగ్రెస్ ఇచ్చిన తప్పదు..!

calendar_today June 22, 2024
person dharshininews
కాంగ్రెస్ ఇచ్చిన తప్పదు..!
chai jrకాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పదు..! - అర్హులైన రైతులకు రుణమాఫీ - ఒకేసారి రైతుల ఖాతాలో జమ - ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హర్షం తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పదని.. త్వరలోనే రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని రైతులందరికీ గడువులోగా ఏకకాలంలో రూ.2లక్షల వరకు రుణమాఫీ చేయాలని తీసుకుర్ణ నిర్ణయం హర్షణీయమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఓ ప్రకటనలో అభివర్ణించారు. రైతు రుణమాఫీకి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయని, దీంతో నియోజకవర్గంలో చాలా కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదన్నారు. గతంలో కూడా ఒకేసారి రుణమాణీ చేసిన ఘనత కాంగ్రెస్‌కు దక్కుంతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తున్నట్లుగా స్పష్టమైన హామీ ఇచ్చిందన్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో రైతులు అందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రైతుల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27355/