schedule Thursday, September 03, 2026

ఆముదం అంత మంచిదా..!

calendar_today June 26, 2024
person dharshininews
ఆముదం అంత మంచిదా..!
chai jr ఆముదం అంత మంచిదా..! - ఆకులు, గింజల్లో ఆరోగ్యం - ఒంటి నొప్పులకు దివ్యౌషధం దర్శిని డెస్క్ : మనందరికి తెలిసిన ఆముదం చెట్టులో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. గ్రామాల్లో ఈ చెట్టు మ‌న‌కు విరివిరిగా క‌న‌బ‌డుతుంది. ఈ చెట్టు గింజ‌ల నుండి తీసిన నూనెనే మ‌నం ఆముదం నూనెగా మ‌నం ఉప‌యోగిస్తూ ఉంటాం. పూర్వ‌కాలంలో ఈ ఆముదం నూనెను ఎక్కువ‌గా ఉప‌యోగించే వారు. మ‌న శ‌రీరంలో ఉండే ప్ర‌తి అవ‌య‌వానికి వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఈ నూనెను వాడ‌డం వ‌ల్ల త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఆముదం నూనె మాత్రమే కాకుండా ఆకులు, గిజంలను కూడా శరీరంలో పలు సమస్యలను తగ్గించడంలో చక్కగా పని చేస్తాయి. అనేక అనారోగ్య సమస్యల్ని తగ్గించడంలో ఆముదం నూనె, ఆకులను ఆయుర్వేదంలో ఉపయోగించేవారు. కాళ్లు, చేతులు, మోకాళ్లు, నడుము, భుజాలు, మెడ ఇలా శరీరంలో ఏ భాగంలో నొప్పి అయినా.. ఆముదం నూనెతో మర్దనా చేసుకుంటే కంట్రోల్ అవుతాయి. ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఇలా ట్రై చేయవచ్చు. పెద్దలకు, చిన్న పిల్లలకు ఆముదం ఆయిల్ ఎంతో చక్కగా పనిచేస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలను కూడా తగ్గుతుంది. మల బద్ధకం సమస్య ఉన్నవారు, కడుపులో నులి పురుగుల సమస్య ఉన్నవారు పరగడుపున ఆముదం నూనె తాగితే.. ఖచ్చితంగా కంట్రోల్ అవుతాయి. సాధారణంగా అప్పుడప్పుడు బాడీ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ఆముదం మొక్కలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి.. ఆయిల్‌లో ఫ్రై చేయండి. వీటిని చిన్న క్లాత్‌లో కట్టి.. నొప్పులు ఉన్న అదుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల నొప్పులు తగ్గుతాయి. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/27393/