గెస్ట్ లెక్చరర్ పోస్టుకు ఆహ్వానం
October 18, 2021
dharshininews
గెస్ట్ లెక్చరర్ పోస్టుకు ఆహ్వానం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్(అథితి అద్యాపకుని) పోస్టుకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రాజమోహన్ రావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరానికి గాను కళాశాలలో హిందీ గెస్ట్ లెక్చరర్ పోస్టు ఖాళీగా ఉందని, దానిని భర్తి చేయడంలో భాగంగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లె వెల్లడించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంఏ హిందిలో 50 శాతం పూర్తి చేసి ఉండాలని, ఈనెల 22వ తేది సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్: 7013317290, 9247743100లకు సంప్రదించాలని తెలిపారు. మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు.