schedule Tuesday, July 07, 2026

దంచికొట్టిన వాన..!

calendar_today June 30, 2024
person dharshininews
దంచికొట్టిన వాన..!
chai jr దంచికొట్టిన వాన..! - తడిసి ముద్దయిన తాండూరు - గోదారులు అయిన రహదారులు - నీట మునిగిన కాలనీలు, స్థంభించిన జన జీవనం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులో వర్షం దంచికొట్టింది. ఆదివారం సాయంత్రానికి ముందు భారీ వర్షం కురిసింది. గంట పాటు కురిసిన వర్షం తాండూరు పట్టణాన్ని అతలాకుతలం చేసింది. పట్టణంలోని మురుగు కాలువుల ఉప్పొంగి ప్రవహించాయి. మురుగు కాలువల నుంచి నీరు రోడ్లపైకి రావడంతో రోడ్లన్నీ గోదారులుగా మారాయి. పట్టణంలోని భద్రేశ్వర చౌరస్తా, గాంధీచౌక్, నెహ్రుగంజ్, సాయిపూర్, మల్‌రెడ్డిపల్లి, పాత తాండూరులోని పలు ప్రధాన రహదారులపై వరథ నీరు ఉధృతంగా ప్రవహించింది. ప్రధాన రోడ్లపై పలు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు పట్టణంలోని శాంతినగర్‌, సాయిపూర్, మల్‌రెడ్డిపల్లి, గ్రీన్‌ సిటీ, పాత తాండూరు కాలనీలు జలమయం అయ్యాయి. ఆయా ప్రాంతాల్లోని పలువురు ఇండ్లలోకి వర్షపు నీరు చేరుకుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇంబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా గ్రామీణ ప్రాంతాల రైతులు కురిసిన వర్షానికి సంతోషం వ్యక్తం చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27495/