schedule Friday, September 04, 2026

వాటితో కరెంటు బిల్లు కట్టొద్దు..!

calendar_today July 2, 2024
person dharshininews
వాటితో కరెంటు బిల్లు కట్టొద్దు..!
chai jr వాటితో కరెంటు బిల్లు కట్టొద్దు..! - జీపే, ఫోన్‌పే, పేటీఎంలలో సేవల నిలిపివేత - ఉత్తర్వులు జారీ చేసిన డిస్కం సీఎండీ ముషారఫ్‌ - నిలిపివేతకు కారణాలు ఏమున్నాయంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఆన్‌లైన్‌లో కరెంటు బిల్లు కట్టేవారందరూ ఇకనుంచి అప్రమత్తంగా ఉండాలని ఎస్పీడీసీఎల్‌ పేర్కొంది. ఇక నుంచి గూగుల్‌ పే, ఫోన్‌పే, అమెజాన్‌ పే, పేటీఎంలో కరెంటు బిల్లు చెల్లింపులు కుదరవని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్‌-డిస్కం) సూచించింది. ఈ మేరకు ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా వినియోగారులకు సూచించింది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే.. ప్రైవేటు బ్యాంకులకు సంబంధించి హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి ప్రధాన బ్యాంకులు ఈ పేమెంట్‌ సిస్టమ్‌ను యాక్టివేట్‌ చేసుకోలేదు. దీంతో ఫోన్‌ పే, క్రెడ్‌ వంటి కంపెనీలు కస్టమర్ల క్రెడిట్‌ కార్డుల బిల్లులను ప్రాసెస్‌ చేయలేవు. దీనివల్ల ఆయా యాప్‌లలో క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపు వీలు పడదు. జులై 1 నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. చెల్లింపులన్నీ భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ ద్వారానే జరగాలని నిర్దేశించింది. కరెంటు బిల్లులు చెల్లించాలంటే ఇకనుంచి డిస్కం వెబ్‌సైట్‌ లేదా టీజీఎస్పీడీసీఎల్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో కరెంటు బిల్లులు చెల్లించాలని డిస్కం సీఎండీ ముషారఫ్‌ ప్రజలకు సూచించారు. అయితే వీటిల్లో కనుక జీపే, ఫోన్‌పే, పేటీఎం వంటి వాటి ద్వారా చెల్లించే ఆప్షన్‌ ఉంటే ఇక్కడ నుంచి మాత్రమే వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇదికూడ చదవండి... https://www.dharshininews.com/27501/