schedule Thursday, September 03, 2026

ఆన్‌లైన్‌లోనే సీఎంఆర్‌ఎఫ్‌ దరఖాస్తులు

calendar_today July 3, 2024
person dharshininews
ఆన్‌లైన్‌లోనే సీఎంఆర్‌ఎఫ్‌ దరఖాస్తులు
ఆన్‌లైన్‌లోనే సీఎంఆర్‌ఎఫ్‌ దరఖాస్తులు - వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ప్రభుత్వం - ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే...? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్‌) దరఖాస్తులను ఇక నుంచి ఆన్ లైన్ లో స్వీకరించనున్నారు. పారదర్శకంగా సీఎంఆర్‌ఎఫ్‌ నిధులను వినియోగించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఆధ్వర్యంలో వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఈనెల 15 తర్వాత నుంచి ఈ వెబ్‌సైట్‌ https//cmrf.telangana.gov.in\ ద్వారానే దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇకనుంచి దరఖాస్తులను ఈ వెబ్‌సైట్‌లోనే అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. chai jr సహాయనిధి కోసం తమ వద్దకు వచ్చే దరఖాస్తుదారుల వివరాలతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ సిఫారసు లేఖలను జత చేసి అప్‌లోడ్‌ చేస్తారు. దరఖాస్తులో లబ్ధిదారుల బ్యాంకు ఖాతా నంబరును తప్పనిసరిగా నమోదు చేయాలి. దరఖాస్తును అప్‌లోడ్‌ చేసిన అనంతరం కోడ్‌నంబరును కేటాయిస్తారు. దాని ఆధారంగా ఒరిజినల్‌ బిల్లును సచివాలయంలో అందజేయాలి. సదరు దరఖాస్తును ఆన్‌లైన్‌లో సంబంధిత ఆసుపత్రికి పంపించి నిర్ధారణ చేసుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే దరఖాస్తును ఆమోదించి చెక్కును సిద్ధం చేస్తారు. చెక్కుపైన లబ్ధిదారుడి బ్యాంకు ఖాతా నంబరును ముద్రిస్తారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెక్కులను స్వయంగా లబ్ధిదారులకు అందజేస్తారు. ఇదికూడ చదవండి... https://www.dharshininews.com/27536/