schedule Tuesday, July 07, 2026

జోహార్‌.. దొడ్డి కొమురయ్య..!

calendar_today July 4, 2024
person dharshininews
జోహార్‌.. దొడ్డి కొమురయ్య..!
chai jrజోహార్‌.. దొడ్డి కొమురయ్య..! - వర్ధంతిలో నివాళులు అర్పించిన నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : జోహార్ దొడ్డి కొమురయ్య అంటూ తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరున్ని తాండూరు నేతలు స్మరించుకున్నారు. గురువారం కురుమ సంఘం ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతిని జరుపుకున్నారు. పట్టణంలోని యశోధనగర్ పార్కులో ఉన్న కొమురయ్య విగ్రహానికి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, కౌన్సిలర్లు విజయ దేవి, బాలప్ప, కురుమ సంఘం నేతలతో పాటు రాజకీయ పార్టీల నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటానికి దొడ్డి కొమురయ్య స్పూర్తి దాయకుడుగా నిలిచారని అన్నారు. ఆయన అమరత్వం చిరస్మరణీయంగా ఉంటుందని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, అసెంబ్లీ కన్వినర్ రజనీ కాంత్, కురుమ సంఘం తాండూరు డివిజన్ అధ్యక్షులు న్యాయవాది గోపాల్, పెద్దేముల్ ఎంపీపీ అనురాధ రమేష్, సంఘం సభ్యులు పూజారి పాండు. పల్లె వెంకటయ్య, గౌడి వెంకటేశం, కుర్వ జగదీష్, సాయిలు, చీమల నర్సింలు, వుల్లి నర్సింలు, రాఘవపురం వెంకటయ్య, హనుమయ్య, శివప్ప, శ్రీశైలం, ఇందూరు బాలు, కందనెల్లి రఘు, గొట్లపల్లి మల్లప్ప, శేఖర్, కిష్టప్ప, నర్సింలు, చిట్టిగణిపూర్ వెంకటయ్య, తోపాజి చంద్రప్ప, అంతారం కుర్వ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/27560/