schedule Monday, September 14, 2026

హనుమాన్ గుడికి తోడ్పాటు..!

calendar_today July 10, 2024
person dharshininews
హనుమాన్ గుడికి తోడ్పాటు..!
హనుమాన్ గుడికి తోడ్పాటు..! - విరాళం అందజేసిన వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు - కృతజ్ఞతలు తెలిపిన అంతారం గ్రామస్తులు తాండూరు. దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం గ్రామంలో హనుమాన్ దేవాలయ నిర్మాణానికి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు తోడ్పాటును అందజేశారు. బుధవారం గ్రామస్తులు వైస్ చైర్ పర్సన్ దీపా, బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలులను మర్యాద పూర్వకంగా కలిశారు. గ్రామంలో హనుమాన్ దేవాలయ నిర్మాణానికి సాయం అందించాలని కోరారు. ఇందుకు వైస్ చైర్ పర్సన్ దీపా, నర్సింలు రూ. 1లక్ష 16లను విరాళంగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలోని హనుమాన్ దేవాలయ నిర్మాణానికి తమవంతు తోడ్పాటు అందిస్తామన్నారు. అదేవిధంగా దేవాలయ నిర్మాణానికి సాయం అందించడం పట్ల దీపా, నర్సింలులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ శాంతు, గ్రామ యువకులు తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27667/