schedule Monday, September 14, 2026

ప్రాజెక్టులు, చెరువుల అభివృద్ధికి సహకరించండి

calendar_today July 11, 2024
person dharshininews
ప్రాజెక్టులు, చెరువుల అభివృద్ధికి సహకరించండి
ప్రాజెక్టులు, చెరువుల అభివృద్ధికి సహకరించండి - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల అభివృద్ధికి సహకరించాలని తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. గురువారం హైదరాబాద్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి పుష్పగుచ్చం అందించి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని విజప్తి చేశారు. ఇందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27691/