schedule Tuesday, July 07, 2026

సేవకు మారుపేరు లయన్స్ క్లబ్

calendar_today July 15, 2024
person dharshininews
సేవకు మారుపేరు లయన్స్ క్లబ్
సేవకు మారుపేరు లయన్స్ క్లబ్ - విద్యాభివృద్దికి తోడ్పాటు అందిస్తాం - తాండూరు అధ్యక్షులు రొంపల్లి సంతోష్‌ గుప్త - నాగసముందర్ గ్రామంలో సీలింగ్‌ ఫ్యాన్ల వితరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : లయన్స్ క్లబ్ తన సేవలతో సేవా కార్యక్రమాలకు మారు పేరుగా నిలుస్తుందని తాండూరు లయన్స్ క్లబ్ గొల్డెన్ జూబ్లీ క్లబ్ అధ్యక్షులు రొంపల్లి సంతోష్‌ కుమార్ గుప్త అన్నారు. సోమవారం తాండూరు నియోజకవర్గ యాలాల మండలం నాగసముందర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సీలింగ్ ఫ్యాన్లను అందజేశారు. క్లబ్ అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ తన తండ్రి స్వర్గీయ రొంపల్లి కిష్టయ్య గుప్త జ్ఞాపకార్థం విద్యార్థుల కోసం సీలింగ్‌ ఫ్యాన్లను వితరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవకు మారుగా నిలుస్తుందన్నారు. ఇప్పటికే ఎన్నో విద్యా, ఆరోగ్యం, సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ఇక ముందు కూడా తాండూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ బసవప్ప, తాండూరు కార్యదర్శి గాజుల వీరప్రసాద్, సభ్యులు భోజిరెడ్డి, మల్లారెడ్డి, శరణు బసప్ప, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27742/