schedule Tuesday, July 07, 2026

తాండూరు మున్సిపల్ కమీషనర్ బదిలీ

calendar_today July 20, 2024
person dharshininews
తాండూరు మున్సిపల్ కమీషనర్ బదిలీ
తాండూరు మున్సిపల్ కమీషనర్ బదిలీ - శానిటరీ ఇనుస్పెక్టర్ పదవిపై ట్రాన్స్‌ఫర్ - కమీషనర్‌గా కొనసాగుతారా అంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శానీటరి ఇనుస్పెక్టర్ హోదా నుంచి తాండూరు మున్సిపల్‌ ఇంచార్జ్ కమీషనర్‌గా విక్రమ్‌ సింహారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శానిటరీ ఇనుస్పెక్టర్ పదవి నుంచే ఆయనను బదిలీ చేశారు. శానిటరీ ఇనుస్పెక్టర్ల నుంచి కమీషనర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులు, ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పలువురు అధికారులను బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. ఈ జాబితాలో తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి కూడా ఉన్నారు. తాండూరు నుంచి ఆయనను జహీరాబాద్‌ మున్సిపల్‌కు శానిటరీ ఇనుస్పెక్టర్‌గా బదిలీ చేశారు. అయితే తాండూరు మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్‌గా కొనసాగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తాండూరు మున్సిపల్ కమీషనర్‌గా ఈ యేడాది ఫిబ్రవరిలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉండగా మున్సిపల్ కార్యాలయంలో పలువురు సీనియర్, జూనియర్ అసిస్టెంట్‌లు కూడా బదిలీ అయ్యారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27852/