దైవసేవలో రాజుగౌడ్..!
July 21, 2024
dharshininews
దైవసేవలో రాజుగౌడ్..!
- భద్రేశ్వర దేవాలయం, సాయిబాబా దేవాలయంలో పూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు రాజుగౌడ్ దైవ సేవలో గడిపారు. ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా తాండూరు పట్టణంలోని భద్రేశ్వర దేవాలయలో స్వామి వారిని దర్శించకున్నారు. అదేవిధంగా కోకట్ రోడ్డు మార్గంలోని శ్రీ షిర్డీ సాయి బాబ మందిరంలోని సాయి నాథున్ని దర్శించుకున్నారు. సాయి బాబాకు పుష్పాభిషేకం చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ తాండూరు ప్రజలు అంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, సన్నిహితులు ఉన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/27858/