schedule Saturday, September 05, 2026

కడుపులో అడుగు పొడుగు సొరకాయ..!

calendar_today July 22, 2024
person dharshininews
కడుపులో అడుగు పొడుగు సొరకాయ..!
కడుపులో అడుగు పొడుగు సొరకాయ..! - షాక్ అయిన వైద్యులు - ఆపరేషన్‌తో తొలగింపు దర్శిని డెస్క్: కొన్ని సందర్భాలలో తెలిసే.. తెలియక చేసే తుంటరి పనులు ప్రమాదకరంగా మారుతాయి. గుట్టుగా చేసి ఆవస్థల పాలై ఆసుపత్రి చేరినప్పుడు అలాంటి సంఘటనలు షాక్‌కు గురిచేస్తాయి. ఇలాంటి షాకింగ్ సంఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. వైద్యులే ఆశ్చర్యానికి గురయ్యారు. వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్‌ జిల్లాలోని ఖుజరహో ప్రాంతానికి చెందిన ఓ యువకుడు మూడు రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. నొప్పి ఎక్కువ కావడంతో ఛతుర్పుర్‌ జిల్లా ఆసపత్రిలో చేరాడు. అతనికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు నివ్వెర పోయిన వస్తువును అతని కడుపులో గుర్తించారు. ఆ యువకుడు కడుపులో ఒక అడుగు పొడగు ఉన్న సొరకాయను గుర్తించారు. సొరకాయ కారణంగా యువకుడు పెద్ద పేగు నలిగిపోయింది. ఈ కారణంగా తీవ్రమైన కడుపునొప్పి వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. దీంతో వెంటనే శస్త్ర చికిత్స చేసి సొరకాయను బయటకు తీశారు. ఇక ప్రస్తుతం యువకుడి పరిస్థితి కొంద ఆందోళన కరంగానే ఉందని చికిత్స కొససాగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఇక యువకుడి శరీరంలో ఈ సొరకాయ మల మార్గం నుంచి వచ్చిన వైద్యులు భావిస్తున్నారు. అయితే యువకుడు సృహలోకి వచ్చిన తరువాతే సొరకాయను ఎవరైనా బలవంతంగా చొప్పించారా.? అసలు కారణం ఏంటన్న విషయం తెలియాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27873/