schedule Saturday, July 04, 2026

నేడే రెండో విడత రుణమాఫీ

calendar_today July 30, 2024
person dharshininews
నేడే రెండో విడత రుణమాఫీ
నేడే రెండో విడత రుణమాఫీ - ఏర్పాట్లు సిద్దం చేసిన రేవంత్ సర్కారు - రుణమాఫీకి అర్హులు ఎవరంటే... హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో భాగంగా రైతు రుణమాఫిని అమలు చేస్తోంది. ఇప్పటికే మొదటి విడతలో రుణమాఫీ నిధులను విడుదల చేయగా నేడు రెండో విడత రుణమాఫీకి అన్ని ఏర్పాట్లను సిద్దం చేసింది. మొత్తం మూడు విడతల్లో రుణమాఫీ పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. మొదటి విడతలో భాగంగా రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేసింది కాంగ్రెస్ సర్కార్. 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లో 6వేల 98 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఇక మంగళవారం (జులై 30) రెండో విడతలో భాగంగా లక్షన్నర వరకు రుణమాఫీ నిధులు విడుదల చేయనున్నారు. . కాగా మంగళవారం లక్షన్నర రుపాయల వరకు రుణాల మాఫీని అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్నారు. రెండో విడతలో సుమారు 7 లక్షల మంది రైతులకు దాదాపు రూ.7 వేల కోట్ల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్టు మొదటి లేదా రెండో వారంలో.. 2 లక్షల రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో రైతుల రుణమాఫీ కోసం మొత్తం 31 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/27953/