schedule Saturday, September 12, 2026

తాండూరు మార్కెట్ అభివృద్ధికి కృషి

calendar_today August 2, 2024
person dharshininews
తాండూరు మార్కెట్ అభివృద్ధికి కృషి
తాండూరు మార్కెట్ అభివృద్ధికి కృషి - కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన మధునాల శ్రీనివాస్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి అభివృద్ధికి కృషి చేస్తానని కార్యదర్శి మధునాల శ్రీనివాస్ అన్నారు. మహబూబ్ నగర్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన శుక్రవారం తాండూరు మార్కెట్ కమిటి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ యార్డులో రైతులకు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. మార్కెట్ కమిటి అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. అంతకుముందు బదిలీపై వచ్చిన శ్రీనివాస్ కు మార్కెట్ కమిటి ఉద్యోగులు హబీబ్ అల్వీ, సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28042/