schedule Tuesday, July 07, 2026

జయహో.. జయశంకర్ సార్..!

calendar_today August 6, 2024
person dharshininews
జయహో.. జయశంకర్ సార్..!
జయహో.. జయశంకర్ సార్..! - తాండూరులో ఘనంగా జయంతి వేడుకలు - నివాళులు అర్పించిన ప్రజా ప్రతినిధులు, సంఘాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : జయహో.. జయశంకర్ సార్ అంటూ.. తెలంగాణ జాతిపిత ప్రోపెసర్ జయశంకర్ సార్ కు నివాళులు అర్పించారు. మంగళవారం తాండూరులో జయశంకర్ సార్ జయంతి ఘనంగా జరుపుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, సోమశేఖర్, మేనేజర్ నరేందర్ రెడ్డి, ఉద్యోగులు, సిబ్బంది జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మున్సిపల్ నుంచి పట్టణంలోని ఇందిరా చౌరస్తా వద్దకు తరలివెళ్లారు. చౌరస్తాలో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా ఫ్రోఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర మరువలేనిది కొనియాడారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సేవ‌ల‌ను తెలంగాణ ప్రజలు, భవిష్యత్ తరాలు గుర్తుంచుకోవాలని, ఆయన సంకల్ప బలం రాష్ట్ర సాధనకు చేసిన నిర్విరామ కృషి మరువరాదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, నేతలు, ఉద్యమ కారులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28067/