schedule Tuesday, July 07, 2026

ఆచార్యకు.. అక్షర నివాళులు..!

calendar_today August 6, 2024
person dharshininews
ఆచార్యకు.. అక్షర నివాళులు..!
ఆచార్యకు.. అక్షర నివాళులు..! - జయశంకర్‌ సారును స్మరించుకున్నవిద్యార్థులు - అక్షర కాన్సెఫ్ట్‌లో జయంతి వేడుకలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని అక్షర కాన్సెఫ్ట్ స్కూల్లో ఆచార్య జయశంకర్‌ సార్‌కు ఉపాధ్యాయులు, విద్యార్థులు నివాళులు అర్పించారు. మంగళవారం స్కూల్లో ఫ్రోఫెసర్ జయశంకర్ సార్ జయంతిని జరుపుకున్నారు. స్కూల్లో ఏర్పాటు చేసిన జయశంకర్ సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం కృషి చేసిన ఆచార్య జయశంకర్ సార్ పోరాటాన్ని, ప్రత్యేక రాష్ట్ర సాధనలో సార్ పాత్రను స్మరించుకున్నారు. అనంతరం ప్రిన్సిపల్ మోహన్ కృష్ణ గౌడ్, డైరెక్టర్లు శ్రీకాంత్ రావు, యూనుస్, ప్రవీణ్‌, రవీందర్, శోభారాణిలు మాట్లాడుతూ జయశంకర్ సార్ ఉద్యమకారుడి నుండి మహోపాధ్యాయుడి దాకా ఆయన తెలంగాణకు దిక్సూచిగా నిలిచిన విధానాన్ని విద్యార్థులకు వివరించారు. తెలంగాణ సిద్ధాంతకర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా ఫ్రోఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని అన్నారు. జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సేవ‌ల‌ను భవిష్యత్ తరాలు గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీచర్లు శ్రీనివాస్ రెడ్డి, విజయ్ కుమార్, అమృత, శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28070/