schedule Tuesday, July 07, 2026

ఆర్య సమాజ్ లో శ్రావణ శోభ..!

calendar_today August 7, 2024
person dharshininews
ఆర్య సమాజ్ లో శ్రావణ శోభ..!
ఆర్య సమాజ్ లో శ్రావణ శోభ..! - వైభవంగా యజ్ఞ మహోత్సవం - పాల్గొన్న మాజీ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ఆర్య సమాజ్ లో శ్రావణ శోభ సంతరించుకుంది. బుధవారం శ్రావణమాసంను పురస్కరించుకుని ఆర్య సమాజ్ లో యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆర్య సమాజ్ సందడిగా మారింది. ఈ యజ్ఞ మహోత్సవంలో తాండూరు మాజీ ఎమ్మెల్యే | తల్లి, వికారాబాద్ మాజీ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో యజ్ఞం పూజను పూర్తి చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భక్తిభావం అలవర్చుకోవాలన్నారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, మహిళ నాయకురాలు శకుంతల, జైశ్రీరాం అశోక్, ఆర్య సమాజ్ పెద్దలు, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28107/