schedule Saturday, September 12, 2026

కంగ్రాట్స్ బాల్‌రెడ్డి అన్నా...!

calendar_today August 9, 2024
person dharshininews
కంగ్రాట్స్ బాల్‌రెడ్డి అన్నా...!
కంగ్రాట్స్ బాల్‌రెడ్డి అన్నా...! - మార్కెట్ కమిటి చైర్మన్‌కు శుభాకాంక్షల వెల్లువ - సన్మానించిన శ్రీశైల పాదయాత్ర బృందం తాండూరు, దర్శిని ప్రతినిధి : కంగ్రాట్యూలేషన్ బాల్‌ రెడ్డి అన్నా.. అంటూ తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్‌కు శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. ఇటీవలే మార్కెట్ కమిటి చైర్మన్‌గా సాయిపూర్ పట్లోళ్ల బాల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మార్కెట్ కమిటి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తాండూరుకు చెందిన శ్రీశైలం ఉమా మహేశ్వర పాదయాత్ర బృందం పట్టణంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. బాల్‌ రెడ్డితో పాటు సతీమణి కౌన్సిలర్ పట్లోళ్ల నీరజారెడ్డిలను సన్మానించారు. బాల్ రెడ్డికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాదయాత్ర బృందం రమేష్‌, శివ, అనిల్, నరేష్, అజయ్, మారుతి, రాజేందర్, శ్రీనివాస్, సుధాకర్, చందుస్వామి తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28181/