schedule Tuesday, July 07, 2026

భళా విత్తన జెండా బ్యాచ్‌లు...!

calendar_today August 14, 2024
person dharshininews
భళా విత్తన జెండా బ్యాచ్‌లు...!
భళా విత్తన జెండా బ్యాచ్‌లు...! - అందమైన రాఖీలు కూడా - పర్యావరణానికి ఎంతో మేలు - స్వదేశి వస్తువులను వినియోగించుకోవాలి - మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక పిలుపు తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశభక్తితో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో భాగంగా రూపొందించిన పూర్ణ స్వదేశీ విత్తన జాతీయ జెండాలు భళా అనిపిస్తున్నాయి. మువ్వన్నెల జెండాలతో తయారు చేసిన రాఖీలు ఆకట్టుకుంటున్నాయి. జాతీయ జెండాలతో పాటు అందమైన రాఖీలు కూడా ఆకట్టుకుంటున్నాయి. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దీర్ఘాయుష్ అనే సంస్థ వీటిని తయారు చేసినట్లు తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య తెలిపారు. వీటి వినియోగం ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. స్వదేశి విత్తన జెండాలు భూమికి బహుమానాలు అనే నినాదంతో దీర్ఘాయుష్ సంస్థ వీటిని రూపొందించిందని వివరించారు. సహజ దేశీయ ఆవు పేడతో వీటిని తయారు చేశారని చెప్పారు. దీంతో పాటు రాఖీ పౌర్ణమి సందర్భంగా అందమైన రాఖీలను కూడా తయారు చేశారని తెలిపారు. వీటిని వినియోగించి నేలలో పడేయడం ద్వారా ప్రకృతికి ఎరువుగా మారుతుందన్నారు. దీని వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. స్వదేశీ విత్తన జెండాలు, రాఖీలు ధరించి ప్రకృతిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/28321/