schedule Sunday, September 13, 2026

శివుడే.. త్రివర్ణ త్రినేత్రుడు..!

calendar_today August 15, 2024
person dharshininews
శివుడే.. త్రివర్ణ త్రినేత్రుడు..!
శివుడే.. త్రివర్ణ త్రినేత్రుడు..! - భద్రేశ్వరాలయంలో ప్రత్యేక అలంకరణ తాండూరు, దర్శిని ప్రతినిధి: స్వాతంత్ర దినోత్సవంలో శివుడు త్రివర్ణ త్రినేత్రుడుగా దర్శనమిచ్చారు. గురువారం తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర దేవాలయంలో ఈ అద్భుత దృశ్యం కనిపించింది. ఆలయ పూజారి విజయ కుమార్ స్వామి 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆలయంలో వెలసిన శివలింగాన్ని త్రివర్ణ పతాకంతో అలంకరించారు. శివుని వద్ద భరత మాత ప్రతిమను కూడా ఉంచారు. దీంతో త్రినేత్ర శివుడు త్రివర్ణ అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయానికి వచ్చిన శివున్ని దర్శించుకున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28360/