schedule Tuesday, July 07, 2026

కోదండరాం సారుకు విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వాలి

calendar_today August 16, 2024
person dharshininews
కోదండరాం సారుకు విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వాలి
కోదండరాం సారుకు విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వాలి - టీజేఎస్ తాండూరు ఇంచార్జ్ సాంబూరు సోమశేఖర్ - ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం పట్ల శుభాకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ జనసమితి(టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షులు ఫ్రో.కోదండరాం సారుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇవ్వాలని తాండూరు నియోజకవర్గ టీజేఎస్ ఇంచార్జ్, మున్సిపల్ కౌన్సిలర్ సాంబూరు సోమశేఖర్ అన్నారు. తెలంగాణ గవర్నర్ కోటాలో శుక్రవారం ఎమ్మెల్సీగా కోదండరాం పదవి ప్రమాణ స్వీకారం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఫ్రో.కోదండరాం పాత్ర కీలకంగా ఉందన్నారు. గత ప్రభుత్వం ఆయనను విస్మరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం హర్షణీయమన్నారు. అదేవిధంగా తెలంగాణలో అన్ని రంగాలతో పాటు ముఖ్యంగా విద్యారంగంపై సంపూర్ణ అవగాహన ఉన్న కోదండరాం సారుకు విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిగా . ఆయన కొత్త సంస్కరణలు తీసుకవస్తారని అభిలాషించారు. అదేవిధంగా తెలంగాణ శాసన మండలిలో నిరుద్యోగ, విద్యార్థి, కర్షక, కార్మిక యువజన గొంతుకగా మారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28416/