schedule Tuesday, July 07, 2026

పాలక మండళ్లకు గ్రీన్ సిగ్నల్..!

calendar_today August 16, 2024
person dharshininews
పాలక మండళ్లకు గ్రీన్ సిగ్నల్..!
పాలక మండళ్లకు గ్రీన్ సిగ్నల్..! - తాండూరులో 14 దేవాలయాలకు నోటిఫికేషన్ - ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో భర్తికి కసరత్తు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని దేవాలయాల పాలక మండళ్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ఆదేశాలు, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో నియోజకవర్గంలోని దేవాలయా పాలక మండళ్ల పదవులు భర్తి కాబోతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఒకే సారి 14 దేవాలయాల్లోని పాలక మండళ్లను భర్తీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. తాండూరు పట్టణం శ్రీ భావిగి భద్రేశ్వర దేవాలయం, శ్రీ నగరేశ్వర దేవాలయం, హానుమాన్ చౌల్ట్రీ దేవాలయం, శ్రీ పోటీ మహరాజ్ దేవాలయం, కాళికాదేవి దేవాలయం, పాత తాండూరు కోటేశ్వర దేవాలయం, తాండూరు మండలం కొత్లాపూర్ రేణుకా ఎల్లమ్మ దేవాలయం, దస్తగిరిపేట్ శ్రీ వేంకటేశ్వర దేవాలయం, నారాయణ పూర్ హనుమాన్ దేవాలయం, చెన్ గెష్ పూర్ హనుమాన్ దేవాలయం, చంద్రవంచ హనుమాన్ దేవాలయం, జినుగుర్తి రామలింగేశ్వర దేవాలయం. యాలాల మండలం రసూల్ పూర్ అభయాంజనేయ దేవాలయం, బషీరాబాద్ మండలం క్యాద్దిర హనుమాన్ దేవాలయాలకు సంబంధించి పాలక. మండళ్లను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ను విడుదల చేశారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకత్వంలో దేవాలయాల్లో నామినేటేడ్ పదవుల్లో భాగంగా అధికార పార్టీ నుంచి నాయకులను పాలక మండళ్ల చైర్మన్లు, డైరెక్టర్ స్థానాలలో భర్తీ చేస్తారు. ఇప్పటికే ఆయా దేవాలయాలకు సంబంధించి పలువురు నాయకుల పేర్లు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28424/