schedule Friday, September 11, 2026

ఇంట్లో గ్యాస్‌ సిలిండర్ లీకేజీ..!

calendar_today August 23, 2024
person dharshininews
ఇంట్లో గ్యాస్‌ సిలిండర్ లీకేజీ..!
ఇంట్లో గ్యాస్‌ సిలిండర్ లీకేజీ..! - అగ్ని ప్రమాదంలో ఇద్దరికి గాయాలు - జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు - బషీరాబాద్ మండలంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంట్లో వినియోగించే గ్యాస్ సిలిండర్‌ లీకేజీ వల్ల అగ్ని ప్రమాదం సంబవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన శుక్రవారం తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రెడ్డిగణాపూర్ గ్రామానికి చెందిన పపెద్ద కుర్వ దేవప్ప ఇంట్లో గ్యాస్ సిలిండర్‌ లీకేజీకి గురయ్యింది. ప్రమాధ వశాత్తో సిలిండర్‌ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దేవప్పతో పాటు అక్కడే ఉన్న మూత్తూమ్‌కు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని వెంటనే తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28492/